“వకీల్ సాబ్”లో ఈ ఎపిసోడ్స్ లో కీలక మార్పులు.?

Published on Jan 17, 2021 3:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన లేటెస్ట్ కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్”. దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తాలూకా టీజర్ ఇటీవలే వచ్చి గట్టి రెస్పాన్స్ ను అందుకుంది. మరి అలాగే ఈ చిత్రాన్ని బాలీవుడ్ చిత్రం పింక్ కు రీమేక్ గా తీసిన సంగతి తెలిసిందే.

మరి ఈ రీమేక్ కు సంబంధించి శ్రీరామ్ వేణు ఇప్పటికే చాలానే మార్పులు చేసినట్టుగా అర్ధం అవుతుంది. మరి ఇదిలా ఉండగా మరిన్ని డిటైల్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో పవన్ సరసన మరోసారి శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరి వీరిద్దరి బ్యాక్ డ్రాప్ స్టోరీని సరికొత్తగా ప్లాన్ చేశారట. అంతే కాకుండా ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపిస్తున్న నివేతా థామస్ అంజలిల బ్యాక్ డ్రాప్ స్టోరీని కూడా దర్శకుడు మన నేటివిటీకి తగ్గట్టుగా చాలానే మార్పులు చేసారట. మరి మేకర్స్ ఎలాంటి మార్పులు చేర్పులు చేసారో తెలియాలి అంటే ఈ చిత్రం సిల్వర్ స్క్రీన్ మీదకు రావాల్సిందే.

సంబంధిత సమాచారం :

More