పవర్ ఫుల్ అధీరా న్యూ లుక్ వదిలిన “కేజీయఫ్” మేకర్స్.!

Published on Jul 29, 2021 11:20 am IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన “కేజీయఫ్ చాప్టర్ 1” ఎంత హిట్టయ్యిందో తెలిసిందే. మరి దానికి కొనసాగింపుగా వస్తున్న మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ “కేజీయఫ్ చాప్టర్ 2” కోసం ఇండియన్ సినిమా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తుంది.

అయితే ఈ చిత్రంలో యష్ చేస్తున్న రాకీ భాయ్ రోల్ ఎంత పవర్ ప్యాకెడ్ గా ఉంటుందో అంతే స్థాయిలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ చేస్తున్న పవర్ ఫుల్ రోల్ అధీరా కూడా ఉండనున్నట్టు ఇప్పటికే చాలా మందికి క్లారిటీ ఉంది. మరి గత ఏడాది ఇదే రోజున సంజయ్ బర్త్ డే కానుకగా ఒక అదిరే పోస్టర్ ని మేకర్స్ వదలగా..

మళ్ళీ ఈ బర్త్ డే కి కూడా విధంగానే మరో పోస్టర్ ని వదిలారు. మరి ఈ న్యూ లుక్ లో అధీరాగా సంజయ్ మరింత పవర్ ఫుల్ గా కనిపిస్తుండడమే కాకుండా మంచి స్టైల్ ని కూడా మిక్స్ చేసారు. పైగా “యుద్ధం అనేది పురోగతి కోసమే.. ఈ విషయంలో రాబందులు కూడా నాతో ఏకీభవిస్తాయి” అనే సాలిడ్ కోట్ ని పొందుపరిచారు. దీనితో దీనికి కూడా భారీ రెస్పాన్స్ వస్తుంది. మరి ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం ఎప్పుడు విడుదల కానుందో చూడాలి.

సంబంధిత సమాచారం :