వైరల్: వెడ్డింగ్ కార్డ్‌పై కేజీఎఫ్-2 వయలెన్స్ డైలాగ్..!

Published on Apr 21, 2022 1:33 am IST

సాధారణంగా ఏదైనా ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమా మ్యానియాలోనే ఉండిపోతారు అభిమానులు. ప్రస్తుతం కేజీఎఫ్-2 మ్యానియాలో ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యినప్పటినుంచి వయలెన్స్ డైలాగ్‌ను బాగా వాడేస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాకా ఆ వాడకం మరింత పెరిగింది. సంజయ్ దత్ తో ఫైట్ తరువాత యష్ “వయలెన్స్‌.. వయలెన్స్‌.. వయలెన్స్‌.. ఐ డోంట్‌ లైక్‌ ఇట్‌.. బట్ వయలెన్స్‌ లైక్స్ మి.. ఐ కాంట్ అవైడ్ ఇట్” అంటూ చెప్పె పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఒక యువకుడు ఏకంగా తన పెళ్లి కార్డులో ఈ డైలాగ్ వాడడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కర్ణాటకలోని బెళగావికి చెందిన చంద్రశేఖర్‌ అనే యువకుడు తన పెళ్లి కార్డులో చివరన .. “మ్యారేజ్‌.. మ్యారేజ్‌.. మ్యారేజ్‌.. ఐ డోంట్‌ లైక్‌ ఇట్‌. ఐ అవైడ్‌. బట్‌, మై రిలేటివ్స్‌ లైక్‌ మ్యారేజ్‌. ఐ కాంట్‌ అవైడ్‌.” అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ వెడ్డింగ్ కార్డు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. నువ్వు దైర్యంగా చెప్పావ్.. కానీ మేము చెప్పలేము అంటూ ఈ కార్డుపై కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :