భారీ సైన్యంతో,భయంకరంగా కెజిఎఫ్2 విలన్ “అధీరా”

Published on Jul 29, 2019 10:41 am IST

గత ఏడాది విడుదలైన ‘కెజిఎఫ్’ ఎంత సంచల విజయం సాధించిందో మాటల్లో చెప్పలేం. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం నమోదు చేసింది. హిందీతో పాటు,సౌత్ ఇండియా మొత్తం అన్ని భాషలలో విడుదలైన ‘కెజిఎఫ్’ అన్ని చోట్లా విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రంలో నటించిన కన్నడ హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు.

ఈ మూవీకి కొనసాగింపుగా ‘కెజిఎఫ్ 2’ ని మొదటి భాగానికి మించి భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఐతే కొద్దిసేపటి క్రితం ‘కెజిఎఫ్ 2’లో ప్రధాన ప్రతినాయకుడైన అధీరా లుక్ చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. వెనుక భారీ సైన్యంతో తలపాగాతో కూడిన ముసుగు ధరించిన సంజయ్ దత్ కిల్లర్ లుక్స్ భయంకరంగా ఉన్నాడు. రాకీ లాంటి కిల్లింగ్ మెషిన్ ఎదుర్కోవాలంటే అధీరా ఈ రేంజ్ లో రావలసిందే మరి.

ఊహించిన విధంగానే బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కెజిఎఫ్2 లో మెయిన్ విలన్ గా చేస్తున్నారన్న సంగతి ధృవీకరరించబడింది. మొదటి భాగాన్ని నిర్మించిన హోమబుల్ ఫిలిమ్స్ ఈ భాగాన్ని కూడా నిర్మిస్తుంది. ‘కెజిఎఫ్ 2’ ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :