“కేజీయఫ్ 2” క్లైమాక్స్ ను ఇలా ప్లాన్ చేస్తున్నారట!

Published on Oct 20, 2020 7:01 am IST

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై రచ్చ చేసేందుకు రెడీ అవుతున్న భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు తుది దశలో ఉంది. ఈ చిత్రంలో కీలక రోల్ అధీరా గా చేస్తున్న సంజయ్ దత్ స్టెప్ తో క్లైమాక్స్ షూట్ రంగం సిద్ధం అయ్యింది.

అయితే ఈ షూట్ కు సంబంధించి లేటెస్ట్ టాక్ ఒకటి వినిపిస్తుంది. ఈ సన్నివేశాన్ని నీల్ కేవలం ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనింగ్ గా తియ్యడం మాత్రమే కాకుండా మైండ్ బ్లోయింగ్ విజువల్ ఎఫెక్ట్స్ తో చూపించనున్నాడట. ఇందులో విఎఫ్ఎక్స్ షాట్స్ చాలా నాచురల్ గా ఉంటాయని తెలుస్తుంది. మొత్తానికి మాత్రం ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని ఊహించని రీతిలో తెరకెక్కిస్తున్నారని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More