మరోసారి హిస్టరీ క్రియేట్ చేసిన బాక్సాఫీస్ మాన్స్టర్ “కేజీయఫ్ 2”.!

Published on Jul 16, 2021 4:00 pm IST


ఇండియన్ బాక్సాఫీస్ మాన్స్టర్ “కేజీయఫ్ చాప్టర్ 2” కోసం మొత్తం మూవీ లవర్స్ ఏ లెవెల్లో ఎదురు చూస్తున్నారో తెలిసిందే. కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ల కాంబోలో వచ్చిన చాప్టర్ 1 చూసి మాస్ ఆడియెన్స్ ఓ లెవెల్లో ఎంజాయ్ చేశారు. అందుకే ఈ సారి చాప్టర్ 2 పై తారా స్థాయి అంచనాలు నెలకొల్పుకొని ఎదురు చూస్తున్నారు.

మరి అన్నీ బాగుంటే ఈరోజే థియేటర్స్ లోకి రావాల్సిన ఈ బాక్సాఫీస్ మాన్స్టర్ చిత్రం కరోనా వల్ల వాయిదా పడింది. అయితే ఈ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంపై ఆల్రెడీ ఉన్న అంచనాలని మరో స్థాయికి తీసుకెళ్లింది ఈ సినిమా టీజర్. మొత్తం అన్ని భాషల్లో కూడా ఓకే టీజర్ గా విడుదల కాబడి వరల్డ్ రికార్డ్స్ సైతం వదల్లేదు. అత్యధిక వ్యూస్ మరియు లైక్స్ లో ఇప్పటికీ చెక్కు చెదరని రికార్డులు ఈ టీజర్ సెట్ చేసింది.

ఇక ఇదిలా ఉండగా ఇపుడు ఈ మాన్స్టర్ టీజర్ మరో సెన్సేషనల్ రికార్డును సెట్ చేసినట్టుగా నిర్మాణ సంస్థ హోంబలే వారు తెలిపారు. ఈ టీజర్ ఇదే స్పెషల్ డే న 200 మిలియన్ మిలియన్ వ్యూస్ మార్క్ క్రాస్ చేసినట్టుగా తెలిపారు. దీనితో ఈ చిత్రం ఖాతాలో ఈ హిస్టారికల్ రికార్డ్ పడ్డట్టు అయ్యింది. మరి మరోపక్క అభిమానులు అంతా కొత్త రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి అది ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :