“కేజీయఫ్ 2″లో రావు రమేష్ రోల్ రివీల్ చేసిన చిత్ర యూనిట్.!

Published on May 25, 2021 12:02 pm IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ యాక్షన్ పీరియాడిక్ డ్రామా చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. మరి ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ కొన్నాళ్ల నుంచి కేజీయఫ్ టైమ్స్ అనే మ్యాగజైన్స్ ను విడుదల చేస్తున్నారు.

మరి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న మన టాలీవుడ్ వెర్సిటైల్ నటుడు రావు రమేష్ పుట్టినరోజు సందర్భంగా తన రోల్ పై స్పెషల్ మ్యాగజైన్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో తాను కన్నెగంటి రాఘవన్ అనే పాత్ర చేస్తున్నట్టు తెలిపారు. అలాగే తాను ఒక సిబిఐ ఆఫీసర్ గా రాకీ కేసును డీల్ చేసే స్పెషల్ ఆఫీసర్ గా కనిపించనున్నట్టు తెలిపారు.

అలాగే ఇందులోనే సిబిఐ ఇంట్రెస్ట్ కేజీయఫ్ పై ఉందా లేక దాన్ని ఆధీనంలోకి తీసుకున్న రాకీ పై ఉందా అన్న మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. మరి ఇలా రావు రమేష్ పుట్టినరోజున మంచి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ను మేకర్స్ వదిలారు.

సంబంధిత సమాచారం :