2020 కి సౌత్ ఇండియా బిగ్ మూవీ అదే

Published on Feb 12, 2020 12:05 am IST

మొన్నటి వరకు 2020 లో సౌత్ ఇండియా నుండి రెండు చిత్రాలు క్రేజీ ప్రాజెక్ట్స్ గా ఉన్నాయి. వాటిలో ఒకటి రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ కాగా, రెండవది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ హీరో యాష్ హీరోగా వస్తున్న కెజిఎఫ్ సీక్వెల్. ఐతే ఆర్ ఆర్ ఆర్ అనూహ్యంగా 2021 జనవరి 8కి వాయిదా పడింది. ఆర్ ఆర్ ఆర్ 2020 జులై 30న విడుదల చేయనున్నట్లు చిత్ర ప్రకటన సమయంలోనే చెప్పడం జరిగింది. ఐతే అనూహ్యంగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ అనేక పర్యాయాలు వాయిదాపడుతూ వచ్చింది.ఐనప్పటికీ ఆర్ ఆర్ ఆర్ దసరా లేదా దీపావళికి వాయిదా పడుతుంది అనుకున్నారు. కానీ ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని రాజమౌళి చెప్పిన తేదీ నుండి ఆరు నెలలు వాయిదా వేశాడు.

దీనితో 2020సౌత్ ఇండియా నుండి పాన్ ఇండియా లెవల్ లో విడుదల అవుతున్న ఒకే ఒక చిత్రం కెజిఎఫ్ 2. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరగా కొద్దిరోజులలో నిర్మాణాంతర కార్యక్రమాలు మొదలుపెట్టనున్నారు. కెజిఎఫ్ 2 జులై నెలలో విడుదలకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ రావు రమేష్ కెజిఎఫ్ లో ఓ రోల్ చేస్తున్నారు. సంజయ్ దత్ విలన్ రోల్ చేస్తుండగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :