ప్రభాస్ తో ఇండియన్ బాక్సాఫీస్ పై గట్టిగా కన్నేసిన “కేజీయఫ్” నిర్మాతలు.!

Published on Dec 2, 2020 2:20 pm IST

గత కొన్ని రోజుల కితమే ఓ సెన్సేషనల్ ప్రకటనతో ఒక్కసారిగా పాన్ ఇండియన్ లెవెల్లో రచ్చ లేపారు ప్రముఖ నిర్మాణ సంస్థ వారు హోంబేలె వారు. ఇప్పుడు నిర్మిస్తున్న “కేజీయఫ్ చాప్టర్ 2″తో ఇండియా మొత్తంలో గుర్తింపు తెచ్చుకున్న వీరు వారి సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ నీల్ తో ప్లాన్ చేసిన మరి బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ సినిమా మోస్ట్ అవైటెడ్ అప్డేట్ ను రివీల్ చేసారు.

ఎప్పటి నుంచో వినిపిస్తున్న గాసిప్స్ ను నిజం చేస్తూ సస్పెన్స్ కు తెర దించేశారు. అయితే ప్రభాస్ అభిమానులు ఈ అప్డేట్ అనంతరం ఓ రేంజ్ లో అప్పటి నుంచి సోషల్ మీడియాలో రచ్చ లేపేశారు. మరి వారి కలలను నిజం చేస్తూ ఊహించని సెన్సేషనల్ అప్డేట్ ను ఇచ్చారు. ఏకంగా లుక్ అండ్ పోస్టర్ తో పాటుగా టైటిల్ ను కూడా ప్రకటించి బాంబు పేల్చారు. కోర మీసపు కట్టుతో గన్ పట్టుకొని అండర్ వరల్డ్ డాన్ లా మోస్ట్ వైలెంట్ మెన్ “సలార్” ను పరిచయం చేశారు. మొత్తానికి ఈ “సలార్” మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చెయ్యడం ఖాయం అని చెప్పాలి.అలాగే ఈ చిత్రం తాలూకా షూటింగ్ జనవరి నుంచి మొదలు కానుంది.

సంబంధిత సమాచారం :

More