ఎవ్వరూ రాత్రికి రాత్రే స్టార్ అయిపోరు – యశ్

Published on Nov 21, 2019 2:30 am IST

రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన కేజీఎఫ్ చాప్టర్- 1 సృష్టించిన సంచలనాల గురించి తెలిసిందే. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 250 కోట్ల‌ వసూళ్లు సాధించింది. ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఈ చిత్రం కన్నడం, హిందీ, తెలుగు, త‌మిళంలో చక్కని వసూళ్లతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫ్రాంఛైజీలో సీక్వెల్ సినిమా కేజీఎఫ్ ఛాప్టర్ 2 శ‌ర‌వేగంగా తెరకెక్కుతుంది. అయితే ఈ ఒక్క సినిమాతో యశ్ పెద్ద స్టార్ అయిపోయాడని ఈ మధ్య తరుచుగా కామెంట్లు వినిపిస్తున్నాయి.

కాగా తాజాగా ఈ వార్తల పై స్పందించిన యశ్ ‘ఎవ్వరూ రాత్రికి రాత్రే స్టార్ అవ్వరని.. ఓ వ్యక్తి చాలా సంవత్సరాలు కష్టపడితేనే స్టార్ డమ్ వస్తోందని.. నేను అలా కష్టపడిన వ్యక్తినేనని.. ఎన్నో సవాళ్లు ఎదుర్కుంటే గానీ తనకు ఈ గుర్తింపు వచ్చిందని.. 2008 నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ కెరీర్‌ను నిర్మించుకున్నానని యశ్ తెలిపారు.

ఇక కేజీఎఫ్ చాప్టర్- 2ను వచ్చే ఏడాది స‌మ్మ‌ర్ లో సినిమాని రిలీజ్‌ చేయ‌నున్నారు. ఈ సీక్వెల్ లో తొలి భాగాన్ని మించి భారీ యాక్ష‌న్ ని చూపించ‌నున్నారు. కేజీఎఫ్ అంటే కోలార్ బంగారు గ‌నులు (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్). ద‌శాబ్ధాల క్రితం కోలార్ బంగారు గ‌నుల్లో మాఫియా క‌థతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. కేజీఎఫ్ గ‌నుల‌ పై ప్ర‌పంచ మాఫియా క‌న్ను ఎలా ఉండేది అన్న‌ దానిని తొలి భాగంలోనే అద్భుతంగా రివీల్ చేశారు. పార్ట్ 2లో ఇంకా భీక‌ర మాఫియాని ప‌తాక స్థాయిలో చూపించ‌బోతున్నారు.

సంబంధిత సమాచారం :

More