“సలార్”లో కూడా “కేజీయఫ్” తరహా షేడ్స్.?

Published on Jan 20, 2021 8:00 am IST

ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా చేపట్టిన పలు భారీ చిత్రాల్లో హై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “సలార్” కూడా ఒకటి. పవర్ ఫుల్ దర్శకుడు ప్రభాస్ తో ప్లాన్ చేసిన ఈ సెన్సేషనల్ చిత్రం మాఫియా తరహాలో ఉంటుంది అని ఆ మధ్య టాక్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఇక ఈ చిత్రం పూజా కార్యక్రమం కూడా ఈ మధ్యనే మొదలు కావడంతో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఇప్పుడు బయటకు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు కూడా తన కేజీయఫ్ కు పని చేసిన టెక్నిషియన్షే పని చేస్తారని తెలిసిందే. మరి అలాగే ఇప్పుడు కొన్ని షేడ్స్ కూడా ఆ సినిమా తరహాలో ఉంటాయని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

నీల్ తీసిన కేజీయఫ్ లో గోల్డ్ మైనింగ్ తరహాలో ఉంటుంది. మరి అలాగే సలార్ లో కోల్ మైనింగ్ బ్యాక్ డ్రాప్ ఉంటుందని తెలుస్తుంది. కానీ అది మేజర్ పార్ట్ అయితే కాదు అని తెలుస్తుంది. ఇప్పటికే పోస్టర్ ను చూస్తే డార్క్ గా డిజైన్ చేశారు. కాస్త కేజీయఫ్ పోస్టర్స్ కూడా అలానే అనిపిస్తాయి. మరి నీల్ ఈ చిత్రాన్ని ఎలా తెరకెక్కిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :