బుల్లితెరపై కెజిఎఫ్ రీసౌండ్ ఏ రేంజ్ ఉంటుందో?

Published on Jul 3, 2020 11:06 am IST

2018 కన్నడ పరిశ్రమకు గుర్తుండిపోయే సంవత్సరం. ఆ ఏడాది కెజిఎఫ్ అనే మూవీ విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కన్నడ పరిశ్రమ గౌరవాన్ని పెంచిన చిత్రంగా ఆ మూవీ నిలిచింది. కాగా ఈ మూవీ జులై 5న ఆదివారం, స్టార్ మాలో ప్రసారం కానుంది. మరి వెండితెరపై ఆటం బాంబ్ లా పేలిన కెజిఎఫ్ బుల్లితెరపై ఏ స్థాయి రేటింగ్ అందుకుంటుందో చూడాలి.

ఇక కెజిఎఫ్ 2 చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. 20 రోజుల షూట్ మిగిలివుందని హీరో యష్ చెప్పారు. మొదటి పార్ట్ కి మించి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా..సంజయ్ దత్ విలన్ రోల్ చేస్తున్నాడు. అలాగే మరో బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కీలకపాత్ర చేస్తున్నారు. కెజిఎఫ్ 2 అక్టోబర్ 23న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More