బాలీవుడ్ లో దూసుకు పోతున్న కేజీఎఫ్2…మామూలుగా లేదుగా!

Published on Apr 19, 2022 11:03 am IST

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కేజీఎఫ్2. కేజీఎఫ్ కి కొనసాగింపు గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సిసలైన తుఫాన్ ను చూపిస్తోంది. ఈ చిత్రం బాలీవుడ్ లో తిరుగులేని కలెక్షన్స్ ను సాధిస్తోంది. సోమవారం రోజు సైతం మరో 25 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టింది.ఈ చిత్రం అమీర్ ఖాన్ దంగల్ ఆల్ టైమ్ రికార్డు ను దాటేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటి వరకూ ఈ సినిమా 219 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టింది.

ఇప్పటికే ఈ చిత్రం అనేక రికార్డు లను నెలకొల్పటం జరిగింది. ఇప్పటి వరకూ పలు ప్రాంతాల్లో ఆల్ టైమ్ రికార్డు సెట్ చేసిన ఈ చిత్రం లాంగ్ రన్ లో ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి. ఈ చిత్రం లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా, రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ లు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :