అక్కడ 400 కోట్ల క్లబ్ వైపు దూసుకు పోతున్న “కేజీఎఫ్2”

Published on May 4, 2022 1:00 pm IST


యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కేజీఎఫ్2. ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. సౌత్ ఇండియా లో మాత్రమే కాకుండా, నార్త్ లో కూడా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ను చూపిస్తుంది ఈ చిత్రం. బాలీవుడ్ లో మంగళవారం మరో 9 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పటి వరకూ ఈ చిత్రం 382 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకు పోతుంది. ఈ చిత్రం త్వరలో 400 కోట్ల రూపాయల క్లబ్ లోకి అడుగు పెట్టడం ఖాయం.

శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రం లాంగ్ రన్ లో ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :