ఫోటో మూమెంట్: కేజీఎఫ్ 2 మూవీ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్న టీమ్

Published on Apr 24, 2022 8:27 pm IST

శాండల్‌వుడ్ మూవీ కేజీఎఫ్ 2 అన్ని చోట్లా బాక్సాఫీస్ వద్ద తన ప్రభంజనం కొనసాగిస్తోంది. యష్ ప్రధాన పాత్రలో, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కేజీఎఫ్ 2 ఘన విజయం సాధించిన సందర్భంగా యష్, ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరగందూర్ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

ఈ ముగ్గురూ కేజీఎఫ్ 1 విజయోత్సవ వేడుకల్లో ఇచ్చిన పోజ్‌ని మళ్లీ రీ క్రియేట్ చేసారు. కేక్‌ పై ఇది ప్రారంభం మాత్రమే అని ఉంది. కేజీఎఫ్ 3 పై అధికారికంగా క్లారిటీ లేకపోయినా, సర్వత్రా ఆసక్తి నెలకొంది. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, హోంబలే ఫిల్మ్స్ ఈ భారీ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించింది. రవి బస్రూర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

సంబంధిత సమాచారం :