ఈ రెండు చిత్రాల్లో ఏది పేలుతుందో ?

Published on Oct 18, 2019 12:20 pm IST

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో కార్తీ చేస్తున్న ప్రయోగాత్మక చిత్రం ‘ఖైదీ’. కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 25 న భారీ స్థాయిలో కె.కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అయితే అదే రోజున మరో తమిల్ స్టార్ విజయ్ ‘విజిల్’ సినిమా కూడా విడుదల కానుంది. మరి ఈ రెండు డబ్బింగ్ చిత్రాల్లో తెలుగు బాక్సాఫీస్ వద్ద ఏ చిత్రం సక్సెస్ అవుతుందో చూడాలి.

కాగా ఖైదీ టీజర్ ట్రైలర్ తోనే అంచనాలను పెంచేసింది. ఇక అవుట్ ఆండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఖైదీ సినిమాలో హీరోయిన్ లేదు. డ్రీం వారియర్ పిక్చర్స్ పతాకం ఫై ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ డిఫరెంట్ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో. అదేవిధంగా విజ‌య్ హీరోగా రాజా రాణి ఫేమ్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా ‘విజిల్’ ‌ పై మంచి అంచనాలు ఉన్నాయి. చూద్దాం ఈ రెండు డబ్బింగ్ చిత్రాల్లో ఏది పేలుతుందో ?

సంబంధిత సమాచారం :

More