‘బాహుబలి’ రికార్డును చిరంజీవి బద్దలు కొట్టేశారా ?

khaidi150
మెగాస్టార్ చిరంజీవి ‘ఖైధీ నెం 150’ చిత్రంతో హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 9 ఏళ్ల తరువాత మెగాస్టార్ చేస్తున్న సినిమా కావడంతో మెగా అభిమానుల్లోనే గాక తెలుగు సినీ ప్రేక్షకులందరిలోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు, ఆశలు ఉన్నాయి. ఎన్నో ఏళ్ల తరువాత మళ్ళీ తెర మీద మెగాస్టార్ ను చూడాలని అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ స్థాయి క్రేజ్ కారణంగా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తారా స్థాయిలో జరుగుతోందట.

తాజాగా సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం ‘ఖైధీ నెం150’ ఆంధ్ర రైట్స్ రూ. 32 కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. తెలుగు సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘బాహుబలి’ చిత్రం యొక్క ఆంద్ర హక్కులతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువే. గతంలో ‘బాహుబలి’ ఆంధ్రా హక్కులు రూ. 30 కోట్ల ధర పలికాయి. ఇంకా ఈ ఖైదీ చిత్రం యొక్క వైజాగ్ హక్కులను క్రాంతి పిక్చర్స్ రూ.7.7 కోట్ల భారీ ధరకు కొనుక్కుందని వినికిడి. గతంలో పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్, బాహుబలి’ వైజాగ్ హక్కులు రూ.7.2 కోట్లకు అమ్ముడైన సంగతి తెలిసిందే. ఈ లెక్కల పై సినిమా యూనిట్ నుండి ఇంకా అధికారిక సమాచారం అందాల్సి ఉంది.