2 మిలియన్ క్లబ్‌లో చేరిపోయిన ‘ఖైదీ నంబర్ 150’!
Published on Jan 16, 2017 9:26 am IST

khaidi
మెగాస్టార్ చిరంజీవిని ఎప్పుడెప్పుడు తెరపై చూద్దామా? అన్న అభిమానుల కల నెరవేర్చేస్తూ దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇస్తూ చిరు ‘ఖైదీ నంబర్ 150’తో వచ్చేసిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్యన జనవరి 11న విడుదలైన ఈ సినిమా అభిమానులను విపరీతంగా ఆకట్టుకొని సూపర్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. చాలా చోట్ల తెలుగు సినిమా బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన బాహుబలిని సైతం బ్రేక్ చేస్తూ ఖైదీ నంబర్ 150 రికార్డు వసూళ్ళు రాబడుతోంది.

ఇక తెలుగు సినిమాకు పెద్ద మార్కెట్‌లలో ఒకటిగా అవతరించిన యూఎస్‌లోనూ ఖైదీ మంచి వసూళ్ళు రాబడుతోంది. ఇప్పటివరకూ యూఎస్‌లో ఈ సినిమా 2 మిలియన్ డాలర్లు వసూలు చేసి, ఈ క్లబ్‌లో ఉన్న బాహుబలి, శ్రీమంతుడు, అ..ఆ.. సినిమాల సరసన చేరిపోయింది. లాంగ్‌రన్‌లో ఖైదీ, ‘శ్రీమంతుడు’ (2.8మిలియన్ డాలర్లు) రికార్డును బ్రేక్ చేసి 3 మిలియన్ వసూలు చేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మించారు.

 
Like us on Facebook