తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్స్ దుమ్మురేపిన ఖైదీ

Published on Nov 8, 2019 10:12 am IST

హీరో కార్తీ ఖైదీ మూవీ తెలుగులో కలెక్షన్స్ లో దూసుకుపోతుంది. చాలా కాలం తరువాత కార్తీ తెలుగు ప్రేక్షకులను ఖైదీ చిత్రంతో ఆకట్టుకున్నారు. కమర్షియల్ అంశాలు లేకుండా కేవలం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కిన ఖైదీ చిత్రం హిట్ టాక్ తెచ్చుకోవడం విశేషం. ముఖ్యంగా కార్తీ, రా అండ్ రఫ్ లుక్ లో సహజ నటన మూవీకి హైలెట్ గా నిలిచింది. రెండు వారాలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకొని మూడవ వారంలోకి ప్రవేశించిన ఖైదీ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు 12.5 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం.

కార్తీ గత చిత్రాలతో పోల్చుకుంటే ఇవి రికార్డు కలెక్షన్స్ గా చెప్పవచ్చు. ఖైదీ చిత్రం తెలుగులో కార్తీ కెరీర్ బెస్ట్ హిట్ గా నిలిచింది. విలక్షణ దర్శకుడు కార్తీక్ కనకరాజ్ కేవలం చీకటి నేపథ్యంలో నడిచే ప్రయోగాత్మక కథగా ఖైదీ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ వారం కూడా తెలుగులో బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ పెద్ద చిత్రాల విడుదల లేకపోవడంతో మరికొన్ని మెరుగైన వసూళ్లు రాబట్టే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం :

X
More