నైజాం ఏరియాలో ‘ఖాకి’ కలెక్షన్స్ !
Published on Dec 1, 2017 3:05 pm IST

తమిళ హీరో కార్తి నటించిన తాజా చిత్రం ‘తీరన్ అదిగారం ఓండ్రు’ తెలుగులో ‘ఖాకి’ పేరుతో విడుదలై మొదటి రోజు నుండే మంచి టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వాస్తవంగా జరిగిన ఒక కేసు, అందులోని పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా దర్శకుడు వినోత్ రూపొందించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది.

దీంతో మొదటి వారంలోనే గాక రెండవ వారంలో సైతం సినిమా మంచి కలెక్షన్లతో నడుస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఇప్పటి వరకు ఈ సినిమాకు నైజాం ఏరియాలో రూ.2.1 కోట్ల షేర్ వసూలైనట్టు తెలుస్తోంది. ఈ విజయంతో కార్తికి తెలుగు, తమిళం రెండింటిలోనూ ఒకేసారి మంచి బ్రేక్ దొరికినట్లైంది.

 
Like us on Facebook