ఖిలాడి చిత్రానికి రికార్డింగ్ షురూ చేసిన డిఎస్పీ!

Published on Jul 17, 2021 12:39 am IST


రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఖిలాడి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన రికార్డింగ్ పనులు తాజాగా ప్రారంభం అయ్యాయి. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఖిలాడి చిత్రానికి రవితేజ మాస్ పెర్ఫార్మెన్స్ కి డేట్ అయ్యేలా ట్రేడ్ మార్క్ సంగీతం అందిస్తున్నారు దేవి శ్రీ ప్రసాద్. అయితే ఈ చిత్రం లో డింపుల్ హయాతీ, మీనాక్షి చౌదరి లు హీరయిన్లుగా నటిస్తున్నారు. ఉన్ని ముకుందన్, అర్జున్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పెన్ ఇండియా పతాకం పై నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :