సూపర్ స్టార్ కి భార్యగా ఖుష్బూ ?

Published on Apr 1, 2020 11:00 pm IST

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే డైరెక్టర్ శివ ఈ చిత్రంలో రజనీ సరసన సీనియర్ బ్యూటీ ఖుష్బూను హీరోయిన్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలో రజని భార్యగా ఖుష్బూ నటిస్తోందట. గ్లామర్ పరంగా ఇప్పటికీ ఏ మాత్రం వంక పెట్టలేని విధంగా ఉండే ఖుష్బూ.. మరి రజిని సరసన ఈ లేట్ వయసులో ఏ రేంజ్ రొమాన్స్ చేస్తోందో చూడాలి.

ఇక రజనీ గత సినిమాలు చూసినా ‘కాలా’లో సీనియర్ నటి ఈశ్వరీ రావ్, ‘పేటా’లో సిమ్రన్ తో కలిసి నటించారాయన. ఇప్పుడు ఈ చిత్రంలో ఖుష్బూతో జోడీ కడుతున్నారు. అన్నట్టు గతంలో రజనీ, ఖుష్బూలు కలిసి ‘అన్నామలై, మన్నన్, పాండియన్, నట్టుక్కు ఓరు నల్లవన్’ వంటి సినిమాలు చేశారు.

ఇక రజనీ మొదటిసారి శివతో చేస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఈ సినిమా పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాని రజనీతో ‘రోబో, పేట’ సినిమాల్ని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం :

X
More