‘భరత్ అనే నేను’ సినిమాలో హీరోయిన్ పాత్ర ఇదే !
Published on Mar 7, 2018 3:18 pm IST

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ నటిస్తోన్న ‘భరత్ అనే నేను’ సినిమా టీజర్ నిన్న విడుదలై సంచలనం సృష్టించింది. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో హీరోయిన్ కైరా అద్వాని మహేష్ బాబు పి.ఎ పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. తెలుగులో కైరా అద్వాని చేస్తోన్న మొదటి సినిమా ఇది. ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీద ఉండగానే చరణ్ సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది ఈ హీరోయిన్.

శరత్ కుమార్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్న ఈ సినిమా ఏప్రిల్ 20 న విడుదలకానుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. కొరటాల శివ, మహేష్ బాబు రెండోసారి కలిసి పనిచేస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

 
Like us on Facebook