1 మిలియన్ వ్యూస్‌తో దుమ్మురేపుతున్న ‘కిక్ 2’!

1 మిలియన్ వ్యూస్‌తో దుమ్మురేపుతున్న ‘కిక్ 2’!

Published on May 16, 2015 9:21 AM IST

Kick2
మాస్ మహారాజ్ రవితేజను డిఫరెంట్‌గా పరిచయం చేసి అతడి కెరీర్‌లో మరిచిపోలేని సినిమాగా నిలిచింది ‘కిక్’. ఇప్పుడా సినిమాకు సీక్వెల్‌గా ‘కిక్ 2’ రూపొందుతోన్న విషయం తెలిసిందే! ‘కిక్’ సినిమాకు దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డియే ఈ సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై హీరో కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించడం విశేషం. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది.థమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ‘కిక్ 2’ ఆడియో గత శనివారం సాయంత్రం విడుదలైంది.

ఇదే వేడుకలో ఆడియోతో పాటు థియేట్రికల్ ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్‌కు అంతటా విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ‘కిక్’ సినిమాలో కిక్ అనే కాన్సెప్ట్‌తో కిక్కెక్కిస్తే, ఈ సినిమాలో కంఫర్ట్ అనే కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తున్నట్టు కనిపిస్తోంది. రవితేజ ఎనర్జిటిక్ యాక్టింగ్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్‌లో విడుదలైన వారం రోజుల్లో ఈ ట్రైలర్ 10 లక్షల (1 మిలియన్)కు పైనే వ్యూస్ సాధించి దూసుకుపోతోంది. దీంతో ఈ సినిమాపై ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయన్నది మరోసారి ఋజువైంది. మరి ఆ అంచనాలను సినిమా అందుకుంటుందా అనేది తెలియాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే!

కిక్ 2 ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు