జూన్ మొద‌టి వారంలో `కిల్ల‌ర్` !

జూన్ మొద‌టి వారంలో `కిల్ల‌ర్` !

Published on May 8, 2019 10:50 PM IST

killer

విజయ్ ఆంటోని, యాక్షన్ కింగ్ అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం కొలైగార‌న్. ఆండ్రూ లూయిస్ దర్శకుడు. అషిమా క‌థానాయిక‌. దియా మూవీస్ ఈ చిత్రాన్ని త‌మిళంలో నిర్మించింది. ఈ చిత్రాన్ని పారిజాత మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై టి.న‌రేష్ కుమార్- టి.శ్రీ‌ధ‌ర్ `కిల్ల‌ర్` పేరుతో తెలుగులో అనువ‌దించి విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నులు సాగుతున్నాయి. జూన్ తొలి వారంలో సినిమా రిలీజ్ కానుంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ.. క్రైమ్ థ్రిల్ల‌ర్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన ఈ సినిమా టీజ‌ర్ ఇటీవ‌లే రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. విజ‌య్ ఆంటోని.. యాక్ష‌న్ కింగ్ అర్జున్ పోటాపోటీగా న‌టించే చిత్ర‌మిద‌ని తెలుస్తోంది. ఈ చిత్రానికి సైమ‌న్.కె.సింగ్ సంగీతం అందిస్తున్నారు.

అర్జున్ ,విజయ్ ఆంథోని , అషిమా నర్వాల్ ,నాజర్ ,సీత, భగవతి పెరుమాల్, గౌతమ్, సతీష్, సంపత్ రామ్ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి:మాటలు, సంగీతం: సైమన్ కె.కింగ్, ఎటిడింగ్: రిచర్డ్ కెవిన్.ఎ, నిర్మాత‌లు: టి.న‌రేష్ కుమార్- టి.శ్రీ‌ధ‌ర్‌, రచన- దర్శకత్వం: ఆండ్రూ లూయిస్.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు