యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘కె-ర్యాంప్’ చిత్రాన్ని రిలీజ్కు రెడీ చేస్తున్న కిరణ్, ఆ తర్వాత ‘చెన్నై లవ్ స్టోరీ’తో రానున్నాడు. ఇక ఈ రెండు సినిమాలపై కిరణ్ అబ్బవరం మంచి అంచనాలు పెట్టుకున్నాడు. అయితే, ఇప్పుడు ఆయన మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలను తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం ఓ కథను రెడీ చేస్తున్నాడట. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించబోతున్నట్లు సినీ సర్కిల్స్ టాక్. ఇప్పటికే కిరణ్ ఈ కథ విని ఓకే చెప్పాడట. ఇక ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ త్వరలో రాబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ సినిమాను రానా దగ్గుబాటి ప్రొడ్యూస్ చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈసారి శ్రీకాంత్ అడ్డాల ఎలాంటి కథతో వస్తాడా అనేది చూడాలి.


