కొబ్బరిమట్టకు అల్లుఅరవింద్ చేసిన మేలేంటి?

Published on Aug 10, 2019 10:19 pm IST

కొబ్బరి మట్ట మూడేళ్ళుగా అనేక విజ్ఞాలను దాటుకుంటూ ఎట్టకేలకు నేడు థియేటర్లలో దిగింది. ఉదయం నుండి కూడా కొబ్బరి మట్ట మూవీపై కొంచెం సానుకూలమైన రిపోర్ట్స్ అందుతున్నాయి. ఐతే నిన్న కొబ్బరి మట్ట నిర్మాత సాయి రాజేష్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. చివరినిమిషంలో ఏర్పడిన ఆటంకాలను తొలగించి కొబ్బరి మట్ట
మూవీ విడుదలకు సహకరించిన అల్లు అరవింద్ గారికి,బన్నీ వాసుగారికి,ఎస్ కె ఎన్ కి కృతజ్ఞతలు తెలుపుతూ “ఏ సంబంధంతో ఇదంతా చేశారో తెలీదు..తేడా కొడితే చాలా నష్టపోతారు అని తెలిసినా చేశారు.కృతజ్ఞతలు అని చిన్న మాట సరిపోదు..అంతకు మించిన మాట కూడ నా దగ్గర లేదు” అని ట్వీట్ చేశారు.

బహుశా కొబ్బరిమట్ట సినిమాకు కావలసిన థియేటర్లు సమకూర్చడం వలన సాయి రాజేష్ ఆలా వారికి కృతజ్ఞత తెలిపారేమో మరి. కాగా కొబ్బరి మట్ట మూవీకి రూపక్ రోనాల్డ్ సన్ దర్శకత్వం వహించగా,షకీలా,కత్తి మహేష్ ప్రధాన పాత్రలలో నటించారు.

సంబంధిత సమాచారం :