ఎన్టీఆర్ రాజకీయ ఆరంగేట్రం పై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు

Published on May 26, 2019 2:00 am IST

తాజాగా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో గుడివాడ ఎం ఎల్ ఏ కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని అప్రహతిహంగా నాల్గవసారి ఎన్నికై చిరస్మరణీయ విజయాన్ని నమోదుచేశారు. నిర్మాత కూడా ఐన నాని యంగ్ టైగర్ కి అత్యంత ఆప్త మితృడు. 2004 లో వచ్చిన “సాంబ” మూవీ కి నిర్మాత కోడలి నాని వ్యవహరించారు.

ఒక మీడియా సమావేశంలో పాల్గొన్న నాని యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాని ఉద్దేశం ప్రకారం చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ పార్టీ రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో కనిపించకుండా పోతుందని జోస్యం చెప్పారు. ప్రస్తుతం హీరోగా ఉన్నత స్థితిలో ఉన్న ఎన్టీఆర్ రాజకీయాలపై ఆసక్తి చూపకపోవచ్చు కానీ, ఎప్పటికైనా రాజకీయాలలోకి వస్తాడు అన్నారు. ఇంకా మాట్లాడుతూ 2024 కల్లా టీడీపీ కనుమరుగవ్వనున్న నేపథ్యంలో , ఇప్పుడే ఎన్టీఆర్ తన రాజకీయ అరంగేట్రం గురించి నిర్ణయం తీసుకోవాలి అన్నారు. మరి తన సన్నిహితుడు చేసిన ఈ వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :

More