వరుణ్ తేజ్ “గని” నుండి కొడ్తే వీడియో సాంగ్ రిలీజ్

Published on Mar 24, 2022 2:15 pm IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం గని. అల్లు అరవింద్ సమర్పణ లో అల్లు బాబీ కంపనీ మరియు రినైస్సన్స్ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని సిద్ధు ముద్ద మరియు అల్లు బాబీ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

తాజాగా ఈ చిత్రం నుండి కొడ్తే వీడియో సాంగ్ ను విడుదల చేయడం జరిగింది. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా లో ఈ పాటలో ఆడి పాడింది. ఈ చిత్రం లో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా గా బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 8 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :