నాని కోసం పదెకరాల విస్తీర్ణంలో కోల్‌కతా సెట్ !

Published on Apr 19, 2021 9:10 am IST

నేచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో రాబోతున్న ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా క్లైమాక్స్ షూట్ కి రంగం సిద్ధం అయింది. ఈ సినిమా ఫైనల్‌ షెడ్యూల్‌ కోసం హైదరాబాద్‌ లో కోల్‌ కత్తా నగరం సెట్‌ని తీర్చిదిద్దారు. పదెకరాల విస్తీర్ణంలో ఈ సెట్‌ని రూపొందించారని, రూ.6.50 కోట్ల వ్యయంతో ప్రొడక్షన్‌ డిజైనర్‌ అవినాష్‌ కొల్లా నేతృత్వంలో ఈ సెట్‌ వేసారని తెలుస్తోంది.

‘‘నాని ఇదివరకెప్పుడూ కనిపించని రీతిలో సరికొత్త గెటప్పుల్లో కనిపిస్తారు. కథ, కథనాలు కూడా అంతే భిన్నంగా ఉంటాయి. ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించే సన్నివేశాలు చాలా క్లిష్టతరమైనవి. వాటి ప్రాధాన్యతని దృష్టిలో ఉంచుకుని భారీ సెట్‌ని నిర్మించి చిత్రీకరణ జరుపుతున్నామని దర్శకనిర్మాతలు తెలిపారు. జిషుసేన్‌ గుప్తా, రాహుల్‌ రవీంద్రన్‌, మురళీశర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: సత్యదేవ్‌ జంగా, సంగీతం: మిక్కీ జె.మేయర్‌, ఛాయాగ్రహణం: సాను జాన్‌ వర్గీస్‌.

సంబంధిత సమాచారం :