దీపావళికి త్రిముఖ పోరు !

దీపావళికి త్రిముఖ పోరు !

Published on Oct 7, 2018 1:56 PM IST

tamil diwali movies

ఈ దీపావళికి తమిళ బాక్సాఫిస్ వద్ద త్రిముఖ పోరు కొనసాగనుంది. 3చిత్రాలు దీపావళి కి విడుదలకు సిద్ధమవుతున్నాయి. దాంట్లో మొదటిది ఇళయదళపతి విజయ్ నటించిన ‘సర్కార్’ చిత్రం. ఈచిత్రం నవంబర్ 6న విడుదలకు సిద్దమవుతుంది. భారీ అంచనాలతో రానున్న ఈచిత్రం తెలుగులో కూడా అదే రోజు విడుదలకానుంది.

ఇక రెండవ సినిమా స్టార్ హీరో ధనుష్ నటించిన ‘ఎన్నై నొక్కి పాయమ్ తోట’. ఈచిత్రం కూడా దీపావళి కి విడుదలకానుంది. అయితే ఈ చిత్రం తెలుగులో విడుదలవ్వడం కష్టమే.

ఇక మూడవ చిత్రం విజయ్ ఆంటోనీ నటిస్తున్న ‘తిమిరు పుడిచివన్’ చిత్రం కూడా నవంబర్ 6న విడుదలకానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈచిత్రం తెలుగులో ‘రోషగాడు’ పేరుతో అదే రోజు విడుదల కానుంది. మరి ఈ త్రిముఖ పోరులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.

తాజా వార్తలు