‘RRR’ సినిమాపై కొమురం భీం మనవడు ఏమన్నాడంటే?

‘RRR’ సినిమాపై కొమురం భీం మనవడు ఏమన్నాడంటే?

Published on Dec 11, 2021 10:25 PM IST


టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం “రౌద్రం రణం రుధిరం”. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ‘మన్యం దొర అల్లూరి సీతారామరాజు’ పాత్రలో నటిస్తుండగా, ఎన్టీఆర్ ‘గొండు బెబ్బులి కొమరం భీమ్’ పాత్రలో మెరవనున్నాడు. భారీ అంచనాలున్న ఈ చిత్రం జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.

ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై కొమురం భీం మనవడు కొమురం సోనేరావ్‌ స్పందించారు. కొమురం భీం పోరాటానికి సినిమా ద్వారా రూపం ఇవ్వడం సంతోషమని ఆయన అన్నారు. కొమురం భీం పోరాట చరితను ప్రపంచానికి తెలియస్తున్న రాజమౌళికి సోనేరావ్‌ ధన్యావాదాలు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు