కొనసాగుతున్న భీం తుఫాను.!

Published on Oct 25, 2020 4:17 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కం పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం నుంచి మోస్ట్ అవైటెడ్ టీజర్ గా తారక్ పై డిజైన్ చేసిన టీజర్ నిలిచింది.

అది కాస్తా ఇటీవలే విడుదల చెయ్యగా ఈ టీజర్ మన టాలీవుడ్ లో పెద్ద తుఫానునే సృష్టించింది అని చెప్పాలి. ఇలా విడుదల అయ్యిందో లేదో అక్కడ నుంచి కనీ వినీ రికార్డులను ఈ టీజర్ నెలకొల్పుతూ టాలీవుడ్ లో మొట్టమొదటిసారిగా 1 మిలియన్ లైక్స్ సాధించిన టీజర్ గా చరిత్ర సృష్టించింది.

అక్కడితో ఆగని భీం తుఫాను లేటెస్ట్ గా 21 మిలియన్ మార్కును ఈ కొద్ది సమయంలోనే సాధించి మరో రికార్డు సెట్ చేసింది. దీనితో తారక్ కెరీర్ లో మరో 20 మిలియన్ మార్క్ టచ్ చేసిన టీజర్ గా ఇది నిలిచింది. ఇవే కాకుండా ఈ టీజర్ ఇంకా నెంబర్ 1 స్థానంలోనే ట్రెండ్ అవుతూ కొనసాగుతుంది. మొత్తానికి మాత్రం భీం తుఫాను అలా కొనసాగుతూనే ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More