కొండ పొలం డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రైమ్ వీడియో!

Published on Oct 20, 2021 6:59 am IST

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం కొండ పొలం. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సాయిబాబు జాగర్ల మూడి మరియు రాజీవ్ రెడ్డి లు నిర్మించడం జరిగింది. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయి డిజిటల్ ప్రీమియర్ గా ప్రసారం అయ్యేందుకు సిద్దం అవుతుంది. ప్రముఖ ఓటిటి దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలో ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ కానుంది.

సాయి చంద్, కోట శ్రీనివాస్ రావు తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించడం జరిగింది. థియేటర్ల లో ఈ సినిమాను మిస్ అయిన వారు ప్రైమ్ వీడియో లో చూసేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :

More