వైరస్ కంటే వాళ్ళే ప్రమాదం..!

Published on Jul 15, 2020 8:28 am IST

డైరెక్టర్ కొరటాల శివ భాద్యత లేకుండా ప్రవరిస్తున్న వారి గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ సోకిందని తెలిసి కూడా కొందరు ఆ విషయం బయట పెట్టకుండా… సమాజంలో తిరుగుతూ ఇతరుల ప్రణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారు అన్నారు. ఇలా తమ రోగాన్ని దాచుకొని వారి ప్రాణాలతో పాటు, తమ చుట్టూ ఉన్న వారి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ఇలాంటి వారు కరోనా వైరస్ కంటే ప్రమాదం అని ఆయన అన్నారు. అలాగే ఈ వైరస్ విషయంలో బాధ్యతా యుతంగా ఉండాలని హితవు పలికారు.

ఇక ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య అనే మూవీ చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ 40శాతం వరకు పూర్తి అయ్యింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More