చిరు, కొరటాల ఛాయిస్ దేవి శ్రీ కాదా ?

Published on Oct 9, 2019 2:15 pm IST

మెగాస్టార్ చిరు, కొరటాల శివల ప్రాజెక్ట్ నిన్ననే లాంఛ్ అయింది. వీరి కాంబినేషన్ అని తెలియగానే ఫ్యాన్స్ ఆశించే అంశాల్లో పాటలు, డ్యాన్సులు కూడా ఉంటాయి. ఇక కొరటాల సినిమా అంటే సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ పేరే ప్రస్తావనకు వస్తుంది. ఎందుకంటే ఆయన చిత్రాలు ‘మిర్చి, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భరత్ అనే నేను’ అన్ని సినిమాలకు సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చారు రాక్ స్టార్.

ఇక చిరు కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నెం 150’కి కూడా దేవి శ్రీయే సంగీతం. కాబట్టి ఈ కొత్త సినిమాకి కూడా ఆయన్నే తీసుకుంటారని అనుకున్నారు. కానీ పరిస్థితి చూస్తే అలా లేదు. పైగా ఈసారి దేవి శ్రీ కాకుండా వేరొకరితో వర్క్ చేయాలని కొరటాల భావిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్. నిన్న ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిఎస్పీ లేకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

మరి అవి నిజమో కాదో తెలియాలంటే టీమ్ నుండి అధికారికంగా సాంకేతిక నిపుణుల వివరాలు బయటకు వచ్చే వరకు ఆగాల్సిందే. సైరా’ చారిత్రక నేపథ్యం కలిగిన చిత్రం కాబట్టి అందులో చిరు మార్క్ డ్యాన్సులు లేవు. దీంతో ఈ 152వ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు అభిమానులు.

సంబంధిత సమాచారం :

X
More