ఎన్టీఆర్ సరసన ఆ బాలీవుడ్ బ్యూటీ ఫిక్స్ ?

ఎన్టీఆర్ సరసన ఆ బాలీవుడ్ బ్యూటీ ఫిక్స్ ?

Published on May 24, 2021 2:00 AM IST

Kiara Advan

‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ – స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో పాన్ ఇండియా సినిమా వస్తుందని ఎనౌన్స్ చేసిన క్షణం నుండి ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని తీసుకోబోతున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఐతే, తాజా వార్త ఏమిటంటే కియారా అద్వానీనే హీరోయిన్ గా తీసుకున్నారట, ఇప్పటికే ఆమె ఈ సినిమా కోసం సైన్ కూడా చేసిందట. మొదటి షెడ్యూల్ ప్రారంభమైనప్పుడు ఈ సినిమా షూట్‌ లో ఆమె పాల్గొంటుంది.

ప్రస్తుతం కొరటాల స్క్రిప్ట్ వర్క్ పై కూర్చున్నాడు. ఎలాగూ కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఆచార్య షూట్ కి గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ ను కొరటాల ఎన్టీఆర్ స్క్రిప్ట్ కోసం వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ కోసం స్క్రిప్ట్ లో కొరటాల కొన్ని మార్పులు చేస్తున్నాడట. ఏప్రిల్‌ 22, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. పైగా ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు