ఆలియా భట్ ప్లేస్ లో మరో స్టార్ హీరోయిన్ ?

Published on Apr 17, 2022 6:03 pm IST

‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ – క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రాబోతున్న పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, పెళ్లి అయ్యాక వెంటనే సినిమాల్లో నటిస్తే బాగోదు అని.. ఆలియా, ‘ఎన్టీఆర్ – కొరటాల’ సినిమా నుంచి తప్పుకుందని రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

మరి, ఈ సినిమాలో హీరోయిన్ పై కొత్త రూమర్స్ వినిపిస్తున్నాయి. మరో క్రేజీ హీరోయిన్ కియారా అద్వానీని హీరోయిన్ గా కొరటాల ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నాడట. ఇక జూన్ మొదటి వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ ను స్టార్ట్ చేయాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు. ముందుగా.. సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్స్ ను తీస్తాడట.

కాగా ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం :