సరైన సమయం కోసం చూస్తున్న కొరటాల.!

Published on May 28, 2021 4:01 pm IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య”. మరి ఈ చిత్రం ఇప్పటికే ఆల్ మోస్ట్ షూట్ కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం బ్యాలన్స్ షూట్ పై కూడా కొరటాల ఈ మధ్యనే అప్డేట్ ఇచ్చారు.

మరి ఆ షూట్ ఎప్పుడు మొదలు కానుందో ఇంకా క్లారిటీ లేదు కానీ కొరటాల మాత్రం ఎలా కంప్లీట్ చెయ్యాలో అన్నదానిపై టాక్ వినిపిస్తుంది. మహా అయితే 15 రోజులు మాత్రమే షూట్ బ్యాలన్స్ ఉన్న ఈ చిత్రాన్ని సింగిల్ షెడ్యూల్ లో ఫినిష్ చేసెయ్యాలని కొరటాల అనుకుంటున్నారట.

మరి అందుకు గాను సరైన సమయం కోసం కొరటాల చూస్తున్నారట. ఒకసారి టైం ఫిక్స్ అయితే శరవేగంగా కంప్లీట్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :