నేను ఇంకా బతికే ఉన్నాను – కోట శ్రీనివాసరావు

Published on Mar 21, 2023 12:00 pm IST

ఇటీవల కబ్జాలో నటించిన ప్రముఖ తెలుగు నటుడు కోట శ్రీనివాసరావు గురించి కొందరు నెటిజన్లు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. కోట శ్రీనివాసరావు అస్వస్థతకు గురయ్యారని, ఆసుపత్రిలో చేరారని కొందరు నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. చాలా మంది ఈ వార్తలను విశ్వసించారు. 75 ఏళ్ల నటుడు కోలుకోవాలని ప్రార్థించారు.

ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ కోట శ్రీనివాసరావు గారు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని, బాగానే ఉన్నారని వీడియో ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా, తప్పుడు వార్తలను నమ్మవద్దని ప్రజలను అభ్యర్థించారు. తప్పుడు వార్తలను వ్యాప్తి చేసే వ్యక్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం :