సంక్రాంతి రోజు “క్రాక్” మరియు “మాస్టర్” నైజాం వసూళ్లు.!

Published on Jan 15, 2021 4:20 pm IST

ఈసారి మన తెలుగు ఇండస్ట్రీలో సంక్రాంతి పండుగను కాస్త ముందుగా తీసుకొచ్చింది మాస్ మహారాజ్ రవితేజ. తన మాస్ కం బ్యాక్ “క్రాక్”తో మొదలు పెట్టారు. నిజానికి తన సినిమాకు వచ్చిన భారీ రెస్పాన్స్ తోనే మిగతా సినిమాలకు కూడా బూస్టప్ ఇచ్చినట్టు అయ్యింది. మరి అక్కడ నుంచి మాస్ మహారాజ్ సినిమాకు స్ట్రాంగ్ వసూళ్లే వస్తున్నాయి. మరి నిన్న సంక్రాంతి పండుగ రోజు వసూళ్ల విషయానికి వస్తే నైజాం ఏరియాలో కూడా గట్టి వసూళ్లే అందుకుంది.

నిన్న ఒక్కరోజే ఈ చిత్రానికి 58 లక్షలు వసూలు చేసి అదరగొట్టింది. కానీ భారీ అంచనాలతో విడుదలై క్రాక్ కన్నా ఎక్కువ లొకేషన్స్ ఉన్న “మాస్టర్” చిత్రంకు 43 లక్షలు మాత్రమే నైజాం నుంచి వసూలు అయ్యాయి. అయితే ఇక్కడ క్రాక్ కు అన్ని రోజులు అయినా మంచి హోల్డ్ కనబర్చగా మాస్టర్ రెండో రోజుకే బాగా డౌన్ అయ్యిపోవడం గమనార్హం. ఓవరాల్ గా నైజాం లో ఈ రెండు చిత్రాల వసూళ్లు ఇలా ఉన్నాయి.

సంబంధిత సమాచారం :