ట్రైలర్ తో మొత్తం లెక్కలు మార్చేసిన మాస్ మహారాజ్..?

ట్రైలర్ తో మొత్తం లెక్కలు మార్చేసిన మాస్ మహారాజ్..?

Published on Jan 5, 2021 7:03 AM IST

Krack

ఓ డిజాస్టరస్ సంవత్సరం అనంతరం అసలు సినిమాలు థియేటర్స్ లో విడుదల అయ్యి ముందులానే అభిమానుల కోలాహలం తో నిండుతుందా అన్న సందిగ్ధం ఏర్పడింది. కానీ ఫైనల్ గా గత ఏడాది సంక్రాంతి తో ఆగిన సినిమా పండుగ ఈసారి సంక్రాంతి పండుగకు రచ్చ లేవనుంది. మరి ఈ పండుగకు వస్తున్న సినిమాల్లో ఒక్కో దానిపై ఒక్కో రకపు అంచనాలు నెలకొన్నాయి.

కానీ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన”క్రాక్” కు స్పెషల్ అనే చెప్పాలి. అంతకు ముందు కూడా మంచి అంచనాలు ఉన్నాయి కానీ ఒక్కసారి ట్రైలర్ పడ్డాక దాదాపు మొదటి ఛాయిస్ గా ఈ సినిమానే తెలుగు ఆడియెన్స్ కు వచ్చింది. పక్కా మాస్ ఫ్లిక్ గా తెరకెక్కించడం అలాగే ట్రైలర్ కూడా దాదాపు రొటీన్ గా కాకుండా వేరేగా అనిపించడం మరింత మందిని అట్రాక్ట్ చేసింది.

సో ఈసారి మాస్ మహారాజ్ గట్టి ఓపెనింగ్స్ నే రాబట్టొచ్చు అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ చిత్రానికి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించారు. ఠాగూర్ మధు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు