మాస్ మహారాజ్ `క్రాక్‌` లేటెస్ట్ అప్డేట్

Published on Nov 21, 2019 11:00 pm IST

‘డాన్‌శీను’,’బ‌లుపు’ వంటి రెండు సెన్సేష‌న‌ల్ హిట్‌ చిత్రాల త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ, దర్శకుడు గోపీచంద్ మ‌లినేని కాంబినేషన్ వస్తున్న హ్యాట్రిక్ మూవీ `క్రాక్‌`. పవర్ ఫుల్ టైటిల్ తో పాటు,ర‌వితేజ మాస్ లుక్‌తో అంద‌రినీ ఆక‌ట్టుకున్న ఈ చిత్రంలో శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని స‌రస్వ‌తి ఫిలింస్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై ఠాగూర్ మ‌ధు నిర్మిస్తున్నారు.

ఇటీవ‌ల పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ నేడు హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో ప్రారంభ‌మైంది. ర‌వితేజ‌, శృతిహాస‌న్‌ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా చేసుకుని అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్నారు.కోలీవుడ్ యాక్ట‌ర్స్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, స‌ముద్ర‌ఖ‌ని ఇందులో ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లు పోషిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి `మెర్స‌ల్‌`, `బిగిల్‌` వంటి సినిమాకు సినిమాటోగ్ర‌ఫీ అందించిన జి.కె.విష్ణు సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More