‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫెమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఓ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రొమాంటింక్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ సీనియర్ నిర్మాత కె.ఎస్.రామరావు నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలోని నటించే హీరోయిన్స్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త తెలిసింది. ఈ సినిమాలో విజయ్ సరసన ముగ్గురు హీరోయిన్స్ రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఇసాబెల్లె డి నటిస్తున్నారు.
కాగా గత కొన్ని నెలలుగా క్రాంతి మాధవ్ మరియు కె.ఎస్ రామారావు ఇద్దరూ.. విజయ్ సరసన నటించే హీరోయిన్స్ వెతికి.. వీరిని ఫైనల్ చేశారట. ఈ చిత్రంలో హీరోయిన్స్ పాత్రలు కథ పరంగా చాలా ముఖ్యమైనవని.. హీరో పాత్రకు సమానంగా ఉంటాయని తెలుస్తోంది. ఇక విజయ్ దేవరకొండతో ఇటీవలే ‘గీతగోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి పాటలందించిన గోపీసుందర్ నే ఈ చిత్రానికి కూడా స్వరాలనందిస్తున్నారు.


