నేడు మరో మూవీకి శ్రీకారం చుట్టనున్న పవన్ కళ్యాణ్..!

Published on Jan 29, 2020 9:00 am IST

పవన్ కళ్యాణ్ ఓ వైపు సీరియస్ పొలిటీషియన్ గా కొనసాగుతూనే మరో వైపు వరుస సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో పింక్ తెలుగు రీమేక్ షూటింగ్ లో పాల్గొంటున్న ఆయన నేడు మరో చిత్రం ప్రారంభించనున్నారు. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ పీరియాడిక్ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. సీనియర్ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో దొంగ గా కనిపిస్తారని తెలుస్తుంది. మొఘలుల కాలంనాటి పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కించనున్నాడట.

కాగా నేడు ఈచిత్రం అధికారికంగా ప్రారంభం కానుందని సమాచారం. హైదరాబాద్ వేదికగా ఈ మూవీ నేడు ప్రారంభించనున్నారని తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పింక్ రీమేక్ కమర్షియల్ అంశాలు లేని సోషల్ మెస్సేజ్ మూవీ కాగా క్రిష్ చిత్రంలో మాత్రం పవన్ కళ్యాణ్ ఆయన ఫ్యాన్స్ కోరుకొనే విధంగా కనిపించనున్నారు. ఇక పవన్ కళ్యాణ్ చేస్తున్న మొట్టమొదటి పీరియాడిక్ మూవీ ఇదే కావడం విశేషం. ఐతే పవన్ కళ్యాణ్ సినిమాలలో తిరిగి నటిస్తున్నప్పటికీ ఆయన అధికారిక ప్రకటనలు చేయడం లేదు. దీనితో ఆయన సినిమాలకు సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ రావడం లేదు.

సంబంధిత సమాచారం :

X
More