వరల్డ్ వార్ II బ్యాక్ డ్రాప్ సీక్రెట్ ఏంటో చెప్పిన క్రిష్

వరల్డ్ వార్ II బ్యాక్ డ్రాప్ సీక్రెట్ ఏంటో చెప్పిన క్రిష్

Published on Oct 13, 2015 6:33 PM IST

krish

టాలీవుడ్ రెగ్యులర్ కథలకి భిన్నంగా ఉండే డిఫరెంట్ కథలని, డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ ని ఎంచుకొని సినిమాలు చేయడానికి ఇష్టపడే దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. అలా ఉన్న తక్కువ మంది దర్శకులలో చెప్పుకోదగిన డైరెక్టర్ క్రిష్. ఇప్పటి వరకూ 3 సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన క్రిష్ తన నాల్గవ సినిమా ‘కంచె’ కోసం బాగా కష్టతరమైన వరల్డ్ వార్ II బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నారు. అలా అని పూర్తిగా యుద్ధం చుట్టూ తిరుగుతుందా అంటే అదీ కాదు.. ఇదొక ప్రేమకథ. 1940లో జరిగిన అందమైన ప్రేమకథకి వరల్డ్ వార్ II బ్యాక్ డ్రాప్ ని మిక్స్ చేసి తీసాడు. అసలు ఇలా ఎందుకు చేసారో అనే విషయాన్ని మేము క్రిష్ ని అడిగి తెలుసుకున్నాం.

వరల్డ్ వార్ II బ్యాక్ డ్రాప్ మీద సినిమా చేయడమే కష్టంతో కూడుకున్న పని, అలాంటిది మీరు ఓ ప్రేమకథకి వరల్డ్ వార్ IIకి లింక్ పెట్టి కంచె సినిమా తీయడం వెనకున్న కారణం ఏంటని క్రిష్ ని అడిగితే ‘ఈ ప్లానెట్ మీద ఎన్నడూ జరగని, జరగబోని రీతిలో జరిగిన గ్రేట్ వార్ వరల్డ్ వార్ II. అది కూడా ఒక మనిషి దురాశ, ఆవేదన వల్ల జరిగింది. ఆ వార్ కి మన భారతీయులు పూర్తి విరుద్దం అయినా మన ఇండియన్స్ 25 లక్షల మంది పాల్గొనాల్సి వచ్చింది. అది నాకు బాగా నచ్చి ఆ బిగ్గెస్ట్ వార్ ని బ్యాక్ గ్రౌండ్ గా చేసుకొని నా లవ్ స్టొరీ చెప్పాలనిపించింది. ఎందుకంటే చెడు చేసే వారి దురాశని, ద్వేషాన్ని, కుల-మత వైరాన్ని, ఎంతటి యుద్దన్నైనా జయించగలిగే శక్తి ప్రేమకి మాత్రమే ఉంది. అందుకే నా ప్రేమకథకి ఈ బ్యాక్ డ్రాప్ అయితే ఇంకా బలాన్ని ఇస్తుందని వరల్డ్ వార్ II బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నానని’ క్రిష్ సమాధానం ఇచ్చాడు.

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రాగ్య జైశ్వాల్ హీరోయిన్ గా నటించింది. సెన్సార్ కూడా పూర్తి చేసుకొని ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా నవంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు