‘కంచె’ హిందీ, తమిళ వర్షన్స్‌పై క్రిష్ క్లారిటీ!

‘కంచె’ హిందీ, తమిళ వర్షన్స్‌పై క్రిష్ క్లారిటీ!

Published on Oct 21, 2015 4:35 PM IST

krish
సగటు తెలుగు సినీ అభిమాని దృష్టిని గత కొద్దికాలంగా పూర్తిగా తనవైపు మళ్ళించుకున్న క్రేజీ సినిమా ‘కంచె’. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’ లాంటి సినిమాలతో తెలుగులో తనదైన బ్రాండ్ సృష్టించుకున్న దర్శకుడు క్రిష్ చేసిన తాజా ప్రయత్నం కంచె ప్రస్తుతం టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. రెండో ప్రపంచయుద్ధ నేపథ్యానికి ఓ ప్రేమకథను జోడించి క్రిష్ రూపొందించిన ఈ సినిమా ఇండియన్ సినిమాలో ఈ అంశంతో వస్తోన్న మొట్టమొదటి సినిమాగా ప్రత్యేకత సంపాదించింది.

దసరా కానుకగా అక్టోబర్ 22న పెద్ద ఎత్తున విడుదల కానున్న ఈ సినిమాను హిందీ, తమిళ భాషల్లోనూ డబ్ చేసి విడుదల చేయాలన్న ఆలోచన ఎప్పట్నుంచో ఉంది. ఈ క్రమంలోనే బాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన పలు టాప్ ప్రొడక్షన్ సంస్థలు కంచె టీమ్‌ను సంప్రదించాయి. ఇక మొదట నవంబర్ నెలకు ఫిక్స్ అయిన ఈ సినిమా అనూహ్యంగా దసరా రేసుకు వచ్చిపడడంతో కంచె టీమ్ హిందీ, తమిళ వర్షన్స్ ఆలోచనను పక్కనపెట్టేసింది.

ప్రస్తుతానికి రేపు ఒక్క తెలుగులోనే ఈ సినిమా విడుదల కానుందన్న విషయాన్ని దర్శకుడు క్రిష్ స్పష్టం చేశారు. హిందీ, తమిళ వర్షన్స్‌కి సంబంధించిన చర్చలు కంచె తెలుగు వర్షన్ రిలీజ్ తర్వాత మళ్ళీ మొదలుపెడతామని ఈ సందర్భంగా క్రిష్ తెలిపారు. డిసెంబర్ నెలలో కంచె హిందీ, తమిళ వర్షన్స్ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా చిరంతన్ భట్ సంగీతం సమకూర్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు