మళ్ళీ తెరపైకి వచ్చిన వరుణ్ తేజ్ – క్రిష్ మూవీ.?

మళ్ళీ తెరపైకి వచ్చిన వరుణ్ తేజ్ – క్రిష్ మూవీ.?

Published on Oct 17, 2014 6:00 PM IST

Varun-teja-krish (1)
మెగా ఫ్యామిలీ నుంచి త్వరలో ప్రేక్షకుల ముందుకు మరో హీరో వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ నటించిన మొదటి సినిమా ‘ముకుంద’. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. శ్రీ కాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది. ఈ చిత్ర టీం నవంబర్ లో ఆడియోని రిలీజ్ చేసి, డిసెంబర్ 25న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇది రిలీజ్ కాక ముందే వరుణ్ తేజ్ రెండవ సినిమా గురించి చర్చలు మొదలయ్యాయి. ముందుగా వరుణ్ తేజ్ మొదటి సినిమాని క్రిష్ దర్శకత్వం వహిస్తాడు అని అనుకున్నారు కానీ మొదటి సినిమా చాన్స్ శ్రీ కాంత్ అడ్డాలకి వచ్చింది. దాంతో ఆ వార్తలు ఆగిపోయాయి. కానీ మళ్ళీ వరుణ్ తేజ్ – క్రిష్ మూవీ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం వరుణ్ తేజ్ రెండవ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించనున్నాడని అంటున్నారు. దాంతో సెకండ్ మూవీ క్రిష్ తో ఉంటుందని అంటున్నారు. మరి అన్నీ కుదిరితే వరుణ్ తేజ్ – క్రిష్ మూవీపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

తాజా వార్తలు