సీనియర్ కమెడియన్ కి ఫుల్ కామెడీ క్యారెక్టర్ !

సీనియర్ కమెడియన్ కి ఫుల్ కామెడీ క్యారెక్టర్ !

Published on Oct 25, 2020 3:05 AM IST


సీనియర్ కమెడియన్ కృష్ణ భగవాన్ అంటేనే మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అని గుడ్ నేమ్ ఉంది ఇండస్ట్రీలో. అయితే యంగ్ కమెడియన్స్ రాకతో ఈ సీనియర్ కి అవకాశాలు తగ్గాయి. కానీ తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం కృష్ణ భగవాన్ కి అదిరిపోయే కామెడీ క్యారెక్టర్ దొరికిందట. గోపీచంద్‌ ప్రస్తుతం చేస్తోన్న సినిమా ‘సిటీమార్’. సంపత్‌ నంది డైరెక్షన్ లో రాబోతున్న ఈ స్పోర్ట్స్‌ బేస్డ్‌ మూవీలో మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కామెడీ కోసం కోచ్ అసిస్టెంట్ పాత్రను చాలా వైవిధ్యంగా మలిచారని తెలుస్తోంది. ఆ పాత్రలో కృష్ణభగవం నటిస్తున్నాడట.

మొత్తానికి చాల కాలం తరువాత కృష్ణ భగవాన్ కి మంచి కామెడీ క్యారెక్టర్ దొరికింది. మరి కృష్ణ భగవాన్ కి ఈ చిత్రంతో దశ తిరుగుతుందేమో చూడాలి. ఇక ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుండగా.. తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా నటిస్తోంది. వీరిద్దరి మధ్య నడిచే ట్రాక్ వెరీ ఇంట్రస్ట్ గా ఉంటుందట. సినిమాలో పక్కా కామెడీ అంశాలను హైలెట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అయితే గోపీచంద్ ఎన్నో ఆశలతో సంపత్ నంది దర్శకత్వంలో చేసిన గౌతమ్ నంద చిత్రం పరాజయం అయింది. అందుకే ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి సూపర్ హిట్ ఇవ్వాలనే కసితో బాగా పట్టుదలగా ఉన్నాడట సంపత్ నంది. మరి ఈ సారి ఈ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు