నిన్న ప్రేక్షకులముందుకు వచ్చిన రెండు చిత్రాలు పాజిటివ్ రివ్యూస్ ను సాధించి మంచి ఓపెనింగ్స్ తో దూసుకుపోతున్నాయి.దాంట్లో మొదటిది అడివి శేష్ , శోభిత దూళిపాళ్ల జంటగా నూతన దర్శకుడు శశి కిరణ్ టిక్క తెరకెక్కించిన చిత్రం’ గూఢచారి’. స్పై త్రిల్లర్ గా తెరకెక్కిన ఈచిత్రం అన్ని వర్గాల వారిని విశేషంగా అలరిస్తుంది. మొదటి రోజు ఈచిత్రంలో ఆంధ్రలోని కృష్ణా జిల్లాలో 7,47,269 లక్షల షేర్ ను కలెక్ట్ చేసింది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అంధించిన ఈచిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లు సంయుక్తంగా నిర్మించాయి.
ఇక రెండవ చిత్రం సుశాంత్, రుహాని శర్మ జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చి ల సౌ’. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం కూడా మంచి రివ్యూస్ ను సాధించి బాక్సాఫిస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. ఇక ఈ చిత్రం మొదటి రోజు కృష్ణా జిల్లాలో రూ. 2,39, 392 లక్షల షేర్ ను రాబట్టింది. మౌత్ టాక్ కూడా బాగుండడం తో ఈ రెండు చిత్రాలకు లాభాలను రాబట్టుకోవడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.


